Tuesday, June 29, 2010

నాలో కలిగే భావాలకు నీ హృదయమే స్పందన..
అటువంటి నీ హృదయం మౌనంగా ఉండిపోతే..
నా భావాలు అచేతనంగా మారిపోవూ!

Friday, April 2, 2010

భావ పరంపర . . .

నీ శ్వాస నా ఉఛ్వాస నిశ్వాసాలకు ఉపిరి పోస్తుందని నా హృదయం నాతో చెప్పినప్పటి నుండి నేనెంత పులకించి పోతున్నానో తెలుసా? నువ్వు నన్ను విడిచి వెళ్ళవన్న, వెళ్ళ లేవన్న అంతర్లీనమైన మధురానుభూతి కాబోలు.

* * * * *

నాలోని భావాలను మువ్వలుగా మార్చి నీ కాలి పట్టీలలో పేర్చాను. నువ్వు నావైపు వేసే అడుగులు చేసే సవ్వడే నా హృదయ స్పందన. నీ అడుగులు దూరంగా వెళ్ళిపోతే నా గుండె నిశ్శబ్ద నిశీధిలో ఒంటరిదైపోతుంది. అడుగులు ఆగిపోతే ..... నా హృదయమే ఆగిపోతుంది.

* * * * *